
భయంకరంగా మహాకాళి ఫస్ట్ లుక్
"మహాకాళి" చిత్రంకు సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ గురువారం విడుదలైంది. ఈ చిత్రానికి టాలీవుడ్ యువ దర్శకుడు, 'హనుమాన్' మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథ అందించారు. పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తుండగా బిగ్ బాస్ ఫైనలిస్ట్ భూమి శెట్టి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అమ్మవారి రూపంలో భయంకరంగా ముఖమంతా నల్లగా రక్తం కారుతున్నట్లు కనిపించిన పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అలాగే సినిమాపై అంచనాలను భారీగా పెంచింది.




