20వసారి రక్తదానం చేసిన దారా సురేష్

0చూసినవారు
20వసారి రక్తదానం చేసిన దారా సురేష్
ములుగు మండలం క్షీరసాగర్ గ్రామానికి చెందిన దారా సురేష్, 20వసారి రక్తదానం చేశారు. హైదరాబాద్‌లోని కొండాపూర్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 72 ఏళ్ల చెరుకూరి కోటేశ్వరరావుకు కిడ్నీ ఆపరేషన్ నిమిత్తం ఆయన రక్తాన్నిశుక్రవారం అందించారు. ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడమే లక్ష్యంగా ఈ సేవ చేస్తున్నట్లు సురేష్ తెలిపారు. యువత సేవా కార్యక్రమాల్లో ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా, గజ్వేల్ పరిధిలో జరిగింది.

సంబంధిత పోస్ట్