గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద రైతుల వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ రైతు దీక్ష చేపడుతున్నట్లు గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని
కాంగ్రెస్, కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వాలు రైతుల జీవితాలతో చెలగాటమాడుతూ, వారిని మోసం చేస్తున్నాయని, పండించిన పంటలను కొనడం లేదని ఆయన ఆరోపించారు. ఎమ్మెస్పీ ధర నిర్ణయించడంలో కేంద్ర ప్రభుత్వం, తెలంగాణలో ఎంత ధాన్యం పండిందనే నివేదిక అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయ్యాయని ఆయన విమర్శించారు.