డీజే సౌండ్ తో డీజే ఆపరేటర్ మృతి UPDATE

2724చూసినవారు
డీజే సౌండ్ తో డీజే ఆపరేటర్ మృతి UPDATE
గణనాథుడి నిమజ్జన శోభాయాత్రలో ఉత్సాహంగా డీజే సౌండ్ తో డీజే ఆపరేటర్ మృతి చెందిన విషయం తెలిసిందే. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొల్గూర్కు చెందిన బండారి దినేష్ (20) సింగాటంలో ఆదివారం రాత్రి వినాయకుడి నిమజ్జన శోభాయాత్రలో డీజే ఆపరేట్ చేస్తూ ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి సీపీఆర్ చేశారు. అనంతరం గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దినేష్ తండ్రి గతంలోనే మృతి చెందగా తల్లి కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది.

సంబంధిత పోస్ట్