సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి మండలం పిటీ వెంకటాపూర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు శనివారం చిన్నకిష్టాపూర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు చెన్న శ్రీనివాస్ తన స్వంత నిధులతో మైక్ సెట్ ను అందజేశారు. ఈ సందర్భంగా చెన్న శ్రీనివాస్ ని పాఠశాల సిబ్బంది శాలువతో సన్మానించారు.