తెలంగాణ పబ్లిక్ పాఠశాల ప్రారంభానికి సర్వం సిద్ధం చేయాలి

3చూసినవారు
తెలంగాణ పబ్లిక్ పాఠశాల ప్రారంభానికి సర్వం సిద్ధం చేయాలి
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల కేంద్రంలోని పోలీస్ గృహ సముదాయాలలో ఈ విద్యా సంవత్సరంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ హైమావతి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పాఠశాలలు నియోజకవర్గాల వారీగా మంజూరు చేయబడ్డాయని, 1వ తరగతి నుండి 8వ తరగతి వరకు అడ్మిషన్ ప్రక్రియ కొనసాగుతోందని, తరగతి గదులు, కార్యాలయ పనులు దాదాపు పూర్తయ్యాయని కలెక్టర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్