కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి

0చూసినవారు
కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి
కొండపాక ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి మండలం పరిధిలోని తిప్పారం గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు తమ వడ్లను తేమ లేకుండా ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని, ఏవైనా ఇబ్బందులుంటే అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, ప్యాక్స్ మాజీ డైరెక్టర్ నరసింహ చారి, ఏవో, ఏఈఓ తదితరులు పాల్గొన్నారు. రైతులు ఈ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్