పారిశుద్ధ్య కార్మికులకు మాజీ సర్పంచ్ బోడపట్ల ఐలం శివ దుస్తుల పంపిణీ

511చూసినవారు
పారిశుద్ధ్య కార్మికులకు మాజీ సర్పంచ్ బోడపట్ల ఐలం శివ దుస్తుల పంపిణీ
గురువారం బతుకమ్మ దసరా పండుగ సందర్భంగా, కుకునూర్ పల్లి మాజీ సర్పంచ్ శివ రియల్ ఎస్టేట్ అధినేత బోడపట్ల ఐలం శివ, సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి, బోబ్బయిపల్లి, మద్దపూర్ గ్రామాలకు చెందిన పారిశుద్ధ్య కార్మికులకు తన స్వంత నిధులతో దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎంతో గొప్పవని, వారు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తారని, వారి సేవలు వెలకట్టలేనివని అన్నారు.