సిద్దిపేట జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా గజ్వేల్ పట్టణంలో విద్యార్థులకు, ప్రజ్ఞాపూర్ ఆటో డ్రైవర్లకు రహదారి భద్రత నియమాలపై అవగాహన కల్పించారు. అసిస్టెంట్ మోటర్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ కుమారి నేహా మాట్లాడుతూ, హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం, మద్యం సేవించి వాహనం నడపడం వంటి తప్పులు తల్లిదండ్రులు చేయకుండా ఉండేలా ప్రమాణం చేయించాలని సూచించారు. ఇందుకోసం ప్రమాణ పత్రాలను స్కూల్ యాజమాన్యం ద్వారా తల్లిదండ్రులకు పంపించారు.