గజ్వేల్: జిల్లా వ్యాప్తంగా చికెన్ షాపుల బంద్

1చూసినవారు
గజ్వేల్: జిల్లా వ్యాప్తంగా చికెన్ షాపుల బంద్
పౌల్ట్రీ కంపెనీల ధోరణిని నిరసిస్తూ రాష్ట్ర చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ లో చికెన్ సెంటర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేసి నిరసన తెలిపారు. పౌల్ట్రీ కంపెనీలు వ్యాపారులకు ఇచ్చే మార్జిన్లను తగ్గించాయని, నిర్వహణ ఖర్చులు పెరిగి లాభాలు తగ్గి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నామని, ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాపారం చేయడం సాధ్యం కావడం లేదని చికెన్ సెంటర్ల యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్