సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ బస్ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, గుర్తింపు సంఘాల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, 11% పీఆర్సీ ప్రకటించడం వంటి నిర్ణయాలపై వారు హర్షం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కార్మికులు తమ చిరకాల స్వప్నం నెరవేరిందని కృతజ్ఞతలు తెలిపారు.