సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రాజిరెడ్డిపల్లి గ్రామంలోని శ్రీ దుర్గమ్మ ఆలయంలో శనివారం అమ్మవారి విగ్రహం నేలకూలి ధ్వంసమైంది. గుర్తుతెలియని దుండగులు కావాలనే విగ్రహాన్ని పగలగొట్టినట్లు స్పష్టమవుతోంది. ఈ ఘటనతో ఆగ్రహించిన గ్రామస్తులు, భక్తులు నిరసన వ్యక్తం చేస్తూ, దుండగులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.