సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలం ధర్మారెడ్డిపల్లిలో జరిగిన ఇటీవల జరిగిన వృద్ధురాలి హత్య కేసును పోలీసులు చేధించారు. శనివారం గజ్వేల్ పోలీస్ స్టేషన్లో ఏసీపీ నర్సింహులు కేసు వివరాలను వెల్లడించారు. గత నెల 24న ధర్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన నల్ల సత్తవ్వ గ్రామ శివారులోని తన వ్యవసాయ పొలానికి వెళ్లింది. విచారణలో నిందితుడు మెదక్ జిల్లా కోమటిపల్లికి చెందిన కిచ్చిగారి శివశంకర్ గా గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు.