కుకునూరుపల్లి ప్రభుత్వ ఐటీఐ మరియు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్‌లో 2026–27/28 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం ఉచిత రిజిస్ట్రేషన్ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ వెంకటరమణ తెలిపారు. గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మార్వో కార్యాలయాలు, గజ్వేల్ ఆర్డీవో కార్యాలయం, సిద్ధిపేట కలెక్టరేట్‌లో ఈ మూడు రోజుల శిబిరాలు జరుగుతాయి. పదో తరగతి ఉత్తీర్ణులైన
విద్యార్థులు సమీపంలోని ఎమ్మార్వో కార్యాలయాల్లో ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.