గజ్వేల్: పెండింగ్ పనులకు నిధులిచ్చి, పనులు పూర్తిచేయాలి

0చూసినవారు
గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, పెండింగ్ ఉన్న అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసి, నెలరోజుల్లో పనులు పూర్తిచేయకపోతే మంత్రులు వివేక్, పొన్నం ప్రభాకర్ పర్యటనలను అడ్డుకుంటామని హెచ్చరించారు. గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్ లో అసంపూర్తిగా ఉన్న ఆర్టీసీ బస్టాండ్ ను పరిశీలించిన ఆయన, కేసీఆర్ హయాంలో గజ్వేల్ కు మంజూరు చేసిన రూ. 180కోట్ల నిధులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేయడం వల్లే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఆరోపించారు. ఈ నిధులు వెంటనే ఇచ్చి పెండింగ్ పనులు పూర్తిచేయడానికి సహకరించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్