గజ్వేల్: అక్రమంగా మట్టి తరలిస్తున్న వాహనాల స్వాధీనం

73చూసినవారు
గజ్వేల్: అక్రమంగా మట్టి తరలిస్తున్న వాహనాల స్వాధీనం
ప్రభుత్వం నుంచి అనుమతులు లేకుండా రాత్రిపూట అక్రమంగా మట్టి తరలిస్తున్న వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు సిద్ధిపేట జిల్లా ములుగు ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు. ములుగులో అక్రమంగా రాత్రివేళలో మట్టిని తరలిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, సిద్దిపేట టాస్క్ ఫోర్స్ సిబ్బందితో కలిసి దాడులు చేశామని అన్నారు. నాలుగు టిప్పర్లు, జేసీబీ, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకొని, ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్