చేబర్తిలో ఘనంగా గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు

0చూసినవారు
చేబర్తిలో ఘనంగా గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామంలో శుక్రవారం మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను గ్రామ సర్పంచ్ ర్యాకం యాదగిరి, పాలకవర్గం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామసభ అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శ్రమదాన కార్యక్రమం చేపట్టారు. మాజీ జెడ్పీటీసీ రామచంద్రం, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ బబ్బురి రామదాస్ గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్