గజ్వేల్ మహిళా కళాశాలలో గాంధీ జయంతి వేడుకలు.. స్వచ్ఛతా కార్యక్రమం

1చూసినవారు
గజ్వేల్ మహిళా కళాశాలలో గాంధీ జయంతి వేడుకలు.. స్వచ్ఛతా కార్యక్రమం
గజ్వేల్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్లు జాతిపిత మహాత్మా గాంధీజీ జయంతిని శుక్రవారం  ఘనంగా నిర్వహించాయి. వాలంటీర్లు గాంధీజీ చిత్రపటానికి నివాళులర్పించి, ఆయన బోధించిన సత్యం, అహింస, సేవ, పరిశుభ్రత, సామాజిక బాధ్యత వంటి విలువలను జీవితంలో ఆచరిస్తామని ప్రతిజ్ఞ చేశారు. గాంధీజీ స్వచ్ఛతకు ఇచ్చిన ప్రాధాన్యతను గుర్తుచేస్తూ, కళాశాల ప్రాంగణంలో “నేను మారుతాను – నా పరిసరాలను మారుస్తాను” అనే నినాదంతో స్వచ్ఛతా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం సిద్దిపేట జిల్లా, గజ్వేల్‌లో జరిగింది.

సంబంధిత పోస్ట్