గురువన్నపేట ఇండిపెండెంట్ సర్పంచ్ కాంగ్రెస్ లో చేరిక

0చూసినవారు
గురువన్నపేట ఇండిపెండెంట్ సర్పంచ్ కాంగ్రెస్ లో చేరిక
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం గురువన్నపేట గ్రామానికి చెందిన స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన సర్పంచ్ బుడిగే జహంగీర్ గౌడ్, జనగామ నియోజకవర్గ ఇంచార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో, ప్రతాప్ రెడ్డి ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై, గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే కాంగ్రెస్ లో చేరినట్లు జహంగీర్ గౌడ్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్