శుక్రవారం కొండపాక మండల శివారులో రాజీవ్ రహదారిపై కారు, ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. అంకిరెడ్డిపల్లికి చెందిన తాళ్లపల్లి రాజు, తల్లి పద్మ, భార్యతో కలిసి బైకుపై కొమురవెల్లికి వెళ్లి, తిరుగు ప్రయాణంలో మెదక్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద యూటర్న్ తీసుకుంటుండగా, హైదరాబాద్ నుంచి సిద్దిపేట వైపు వస్తున్న కారు వారి బైకును వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ముగ్గురూ కిందపడి గాయపడ్డారు. క్షతగాత్రులను సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.