కొండపాక: గతంలో మాదిరిగానే ధాన్యం కొనుగోలు చేయాలి

598చూసినవారు
కొండపాక: గతంలో మాదిరిగానే ధాన్యం కొనుగోలు చేయాలి
సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతికి దుద్దెడ గ్రామ జిపిఓ ద్వారా బుధవారం ఒక వినతి పత్రం అందజేయబడింది. గతంలో మాదిరిగానే ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని జల్లి పట్టకుండా కొనుగోలు చేయాలని రైతులు కోరారు. ప్రస్తుత వేసవి పరిస్థితుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో సరైన వసతులు లేక, ముఖ్యంగా కరెంటు సరిగా లేకపోవడం, సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడం వంటి కారణాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని వినతిలో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్