సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ కు 60 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు, కొండపాక మండలంలోని విశ్వనాథపల్లి శివారు రాజీవ్ రహదారిపై ప్రమాదం నుంచి తప్పించుకుంది. హైదరాబాద్ వైపునకు వెళ్తున్న బోర్వెల్ వాహనం డ్రైవరు అకస్మాత్తుగా ఎడమవైపునకు మళ్లించడంతో, వెనకాల వస్తున్న బస్సు డ్రైవరు ప్రమాదాన్ని తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టి ఆపాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. కుకునూరుపల్లి పోలీసులు బస్సు డ్రైవరు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.