గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి, పదవ తరగతి ఫలితాల్లో కొండపాక మండల టాపర్‌గా నిలిచిన సిరిసినగండ్ల గ్రామానికి చెందిన మహమ్మద్ సుహానాను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివి గ్రామానికి, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. సుహానాకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.