
విశాఖ చేరుకున్న సచిన్ టెండూల్కర్
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ విశాఖపట్నం చేరుకున్నారు. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) శతాబ్ది వేడుకల్లో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో సచిన్ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉంది. ఏయూ శతాబ్ది ఉత్సవాలకు సచిన్ రాకతో ప్రాధాన్యత పెరిగింది.




