ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల గజ్వేల్ నందు మంగళవారం లాంచ్ గర్ల్స్ ఓరియంటేషన్ ప్రోగ్రాం ఘనంగా నిర్వహించబడింది. విద్యార్థినులను భవిష్యత్ ఉద్యోగ అవకాశాలకు సిద్ధం చేయడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. కళాశాల విద్య మరియు లాంచ్ గర్ల్స్ స్వచ్ఛంద సంస్థ అవగాహన ఒప్పందంలో భాగంగా కళాశాలల్లోని మహిళా విద్యార్థులకు ఉద్యోగాలకు, వ్యవస్థాపకతకు కావలసినటువంటి నైపుణ్యాలను పెంపొందించడం, శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం ఈ కార్యక్రమం ఉద్దేశం అని కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ అనిత అబ్రహం పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల మహిళా సాధికారత కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు