మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి సత్యనారాయణ ఇటీవల మరణించిన నేపథ్యంలో, మంగళవారం హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో మాజీ సర్పంచ్ మాధవి రాజిరెడ్డి, రాంరెడ్డి, మల్లేష్ యాదవ్ తదితరులు హరీష్ రావును పరామర్శించారు. కీర్తిశేషులు సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.