పలువురు నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు

0చూసినవారు
పలువురు నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు
మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రజలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటుతోనే సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లో గజ్వేల్, కుకునూర్పల్లి, జగదేవపూర్ మండలాలకు చెందిన కాంగ్రెస్, బీఎస్పీ పార్టీల నాయకులు, కార్యకర్తలు పలువురు ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు దేవీ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :