మార్కుక్: ప్రత్యేక అలంకరణలో కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం

0చూసినవారు
మార్కుక్: ప్రత్యేక అలంకరణలో కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో శ్రీకనకదుర్గమ్మ అమ్మవారి ప్రథమ వార్షికోత్సవం బుధవారం గ్రామ ప్రజలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలతో గణపతి పూజ, కుంభాభిషేకం, హోమం వంటి కార్యక్రమాలు జరిగాయి. ప్రత్యేక అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. గ్రామ ప్రజలు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితులు, గ్రామ సర్పంచ్, గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్