సిద్దిపేట జిల్లా మర్కుక్ గ్రామంలో జరగనున్న నాభి శిల (బొడ్రాయి) ప్రతిష్ట మహోత్సవాలకు
కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు బబ్బూరి మల్లేశం గౌడ్, బుధవారం హైదరాబాద్ లో మంత్రి వివేక్ వెంకటస్వామికి ఆహ్వాన పత్రికను అందజేశారు. మంత్రి సానుకూలంగా స్పందించి కార్యక్రమానికి హాజరవుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు
కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.