
'ఆంధ్ర కింగ్ తాలూకా' మూవీ విడుదల తేదీ మార్పు ?
రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ చిత్రంపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఈ నెలాఖరున థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్న ఈ సినిమా నిర్మాణానంతర పనులు వేగంగా జరుగుతున్నాయి. మొదట నవంబర్ 28న విడుదల కావాల్సి ఉండగా తాజా సమాచారం ప్రకారం ఒక రోజు ముందుగానే నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.




