గజ్వేల్‌లో పోలియో చుక్కలు వేసిన అధికారులు

760చూసినవారు
గజ్వేల్‌లో పోలియో చుక్కలు వేసిన అధికారులు
గజ్వేల్ ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో ఆదివారం, జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ దేశబోయిని నర్సింహులు, జిల్లా బాలల సంక్షేమ సమితి సభ్యులు, ఇంచార్జ్ చైర్‌పర్సన్ ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో వ్యాక్సిన్ వేయించాలని, ప్రతి చిన్నారి ఆరోగ్యవంతమైన భవిష్యత్తు కోసం బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్