సిద్ధిపేట జిల్లా గజ్వేల్- ప్రజ్ఞాపూర్ డిపో పరిధిలోని ప్రయాణికులు తమ సమస్యలను డీఎం దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ డిపో మేనేజర్ పవన్ తెలిపారు. గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రయాణికులు తమ సమస్యలను 9959226270 ఫోన్ నంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.