గతేడాది రెమ్యూనరేషన్ ను చెల్లించండి: డిటిఎఫ్ నాయకులు

4చూసినవారు
గతేడాది రెమ్యూనరేషన్ ను చెల్లించండి: డిటిఎఫ్ నాయకులు
గత విద్యా సంవత్సరంలో 10వ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం చేసి సంవత్సరం గడిచినా, ఉపాధ్యాయులకు టీఏ, డీఏలు, రెమ్యూనరేషన్లు చెల్లించలేదని సిద్దిపేట జిల్లా డీటీఎఫ్ నాయకులు ఆరోపించారు. ఈ చెల్లింపులను వెంటనే జరిగేలా చూడాలని వారు డీఈఓ శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో డీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతిరెడ్డి, ఉపాధ్యక్షుడు చంద్రభాను, కార్యదర్శి మల్లయ్య, ఆడిట్ కమిటీ సభ్యులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.