సిద్దిపేట జిల్లా, గజ్వేల్ పరిధిలోని గిర్మాపూర్ గ్రామంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఉపసర్పంచ్ హేమలత జ్ఞానేశ్వర్ ప్రారంభించారు. 5 ఏళ్ల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించి, పోలియో రహిత సమాజాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. బల్వంతపూర్ గ్రామంలో కూడా పోలియో నివారణకు రెండు చుక్కలు ఉచితంగా వేయించి, జీవితాంతం రక్షణ కల్పించాలని సూచించారు. ప్రతి బిడ్డకు భవిష్యత్తు, ప్రతి ఇంటికి ఆరోగ్యం అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం జరుగుతోంది.