రహదారిపై నిలిచిన వర్షపు నీరు.. బాటసారులకు తప్పని ఇక్కట్లు

0చూసినవారు
రహదారిపై నిలిచిన వర్షపు నీరు.. బాటసారులకు తప్పని ఇక్కట్లు
సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి మండల కేంద్రంలో భారీ వర్షాల కారణంగా రాజీవ్ రహదారి పక్కన నీరు నిలిచిపోయింది. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో రహదారి పక్కన చెరువులా నీరు పేరుకుపోయింది. దీనివల్ల బాటసారులు, విద్యార్థులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు వెళ్లేటప్పుడు నీరు ఎగసిపడుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే నీటిని తొలగించి, డ్రైనేజీలు నిర్మించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్