
మహిళా న్యాయవాది దారుణ హత్య.. సోదరుడే చంపించాడు
TG: మహిళా న్యాయవాది దారుణ హత్య ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆస్తి కోసం చెల్లెలిని సుఫారీ గ్యాంగ్‌తో సొంత అన్న రాజు చంపిచినట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఆస్తి కోసం ఇబ్బంది పెడుతుందని సుపారీ గ్యాంగ్‌తో హత్య చేయించాడు. స్వప్న ఉదయం పొలానికి వెళ్లిన సమయంలో ముసుగులు ధరించి కారులో వచ్చిన సుపారీ గ్యాంగ్ కత్తితో పొడిచి చంపి పారిపోయారు. కాగా పోలీసులు ఇద్దరని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.




