గజ్వేల్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా, రిటర్నింగ్ అధికారుల సమక్షంలో బీఎల్వోలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో గజ్వేల్ కమీషనర్, సహాయ జిల్లా ఎన్నికల అధికారి సమీక్ష సమావేశం నిర్వహించారు. 71 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఫోటో ఓటర్ స్లిప్పుల పంపిణీపై చర్చించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్ స్టేషన్ వారీగా ఫోటోలతో కూడిన ఓటర్ స్లిప్పులు, ఓటర్ జాబితాలను బీఎల్వోలకు అందజేసినట్లు తెలిపారు.