సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో బీటీ రోడ్డు నిర్మాణం పూర్తయినా, మోరీలు నిర్మించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు రహదారులపై నీరు నిలిచి, రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షపు నీరు ఇళ్లలోకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఉప సర్పంచ్ నాగరాజు, వార్డు సభ్యుడు రాములు, గ్రామస్తులు సురేష్, సుధాకర్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. వెంటనే మోరీలు నిర్మించి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని వారు కోరారు.