
ఒకేసారి ఇద్దరు యువతులతో ప్రేమ పెళ్లి(వీడియో)
ఛత్తీస్‌గఢ్‌లోని కొండగావ్(D)కు చెందిన హితేశ్ యాదవ్ అనే యువకుడు ఇద్దరు యువతులను ఒకేసారి, ఒకే వేదికపై వివాహం చేసుకున్నాడు. అయితే వీరిది ప్రేమ వివాహం కావడం విశేషం. తొలుత ఫూల్వతిని ప్రేమించగా.. ఆమె వివాహానికి ఒప్పుకోలేదు. దీంతో హితేశ్ యామినితో ప్రేమలో పడ్డాడు. ఈ క్రమంలో యామినితో పెళ్లికి రెడీ కాగా, తననూ చేసుకోవాలని ఫూల్వతి కోరింది. దీంతో ఇరు కుటుంబాల అనుమతితో వారిని వివాహం చేసుకున్నాడు. ‘లక్కీ ఫెలో’ అని కొందరు.. ఇలా బుక్కయ్యావేంటని మరికొందరు SMలో కామెంట్లు చేస్తున్నారు.




