
సిగరెట్ మానేయాలా? రహస్య పద్ధతులతో శాశ్వత విముక్తి!
సిగరెట్ అలవాటు మానేందుకు ప్రయత్నించి విఫలమయ్యే వారికి సిగరెట్ మానేయడం మొండి పట్టుదల కాదని, తెలివైన ప్రయాణమని నిపుణులు చెబుతున్నారు. సిగరెట్ తాగాలనే కోరిక వచ్చే సమయాలను గుర్తించి, ఆ సమయంలో యాలకులు, లవంగాలు నమలడం వంటి ప్రత్యామ్నాయాలు పాటించాలని సూచిస్తున్నారు. కోరిక వచ్చినప్పుడు ‘5 నిమిషాల రూల్’ పాటించి వేరే పనిలో నిమగ్నమవ్వడం ఉపయోగకరమంటున్నారు. రోజుకు 3–4 లీటర్ల నీరు తాగడం, ప్రాణాయామం, ఊపిరితిత్తుల వ్యాయామాలతో నికోటిన్ ప్రభావం తగ్గుతుందని, విఫలమైనా నిరుత్సాహపడకుండా మళ్లీ ప్రయత్నించాలని నిపుణులు సూచిస్తున్నారు.




