సిద్ధిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన రామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షుడు రామకోటి రామరాజు తెలిపిన వివరాల ప్రకారం, భద్రాచల శ్రీసీతారాముల కల్యాణోత్సవంలో వినియోగించే గోటి తలంబ్రాలను సిద్ధం చేసేందుకు రామకోటి భక్త సమాజానికి నాలుగవసారి అవకాశం లభించింది. ఆయన కృషిని గుర్తించి, బుధవారం భద్రాచల దేవస్థాన ఆలయ ఈవో మూడు క్వింటాళ్ల వడ్లను గోటి తలంబ్రాలుగా సిద్ధం చేసేందుకు అందజేశారు. ఈ సందర్భంగా రామకోటి రామరాజు గోటి తలంబ్రాలు సిద్ధం చేసేందుకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు.