ప్రభుత్వ బడుల బలోపేతానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తూoకుంట నర్సారెడ్డి పేర్కొన్నారు. గురువారం వర్గల్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఎంఈఓ సునీతతో కలిసి పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్, తదితర అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామీణ విద్యార్థులే చక్కటి ప్రతిభ చాటుతూ ఉన్నత శిఖరాలకు చేరుకుంటుండగా, క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్యనందిస్తూ గురువులు వారిని తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.