సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారంలో అనుమానాస్పద స్థితిలో తల్లి కుమార్తె మృతి ఒక్కసారిగా కలకలం రేపింది. గురువారం రాత్రి వెల్దుర్తి భారతమ్మ (65), కవిత మృతి చెందారు. మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.