గజ్వేల్ మండలం జంగంరెడ్డిపల్లిలో ఇంట్లో చోరీకి పాల్పడిన నలుగురు అసోం రాష్ట్రానికి చెందిన యువకులను స్థానిక పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఈ నెల 25న ధనలక్ష్మి అనే మహిళ తన కిరాణా దుకాణానికి తాళం వేసి వెళ్లగా, 27న తిరిగి వచ్చి చూసేసరికి తాళాలు పగలగొట్టి, బీరువాలో ఉన్న రెండున్నర తులాల బంగారం, రూ.13 వేల నగదు అపహరణకు గురైనట్లు గుర్తించారు. బాధితుల ఫిర్యాదుతో నిఘా పెట్టిన పోలీసులు అనుమానాస్పదంగా కనిపించిన మనబ్ కాకటి, హైనుల్ హాక్, కల్పజ్యోతి బోరా, బికాస్ దాస్ అనే యువకులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరం అంగీకరించిన వారి నుంచి బంగారం, దొంగతనానికి ఉపయోగించిన ఇనుప రాడ్ స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రవిరాజు తెలిపారు.