యాదగిరిగుట్టలో సూర్య నమస్కారాల బృందం ఆధ్యాత్మిక యాత్ర

6చూసినవారు
యాదగిరిగుట్టలో సూర్య నమస్కారాల బృందం ఆధ్యాత్మిక యాత్ర
సిద్దిపేట జిల్లా గజ్వేల్ సూర్య నమస్కారాల బృందం ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకుంది. నిత్యం యోగా, సూర్య నమస్కారాలు చేస్తూ ఆరోగ్యంపై అవగాహన కల్పించే ఈ బృందం, లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ ఈ ఆధ్యాత్మిక యాత్రను చేపట్టింది. కొండపైకి చేరుకున్న బృందం సభ్యులు స్వయంభు నరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ శారీరక, మానసిక ఆరోగ్యంతో ఉండాలని వారు ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్