కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల విద్యారంగం అస్తవ్యస్తం

514చూసినవారు
కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల విద్యారంగం అస్తవ్యస్తం
కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల విద్యారంగం అస్తవ్యస్తంగా మారుతోందని డీసీసీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో విద్యారంగంపై కేంద్ర విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పార్టీ శ్రేణులతో కలిసి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన 'ఛాత్రోస్ కీ గూంజ్'లో భాగంగా నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆంక్షారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో జాప్యం, నీట్ పరీక్షల పేపర్ లీకేజీల కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్రం చెలగాటమాడుతోందని ఆమె విమర్శించారు.

సంబంధిత పోస్ట్