సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని జగదేవపూర్ మండలం పలుగుగడ్డ గ్రామంలో నూతనంగా వెలసిన పెద్దమ్మ తల్లి ఆలయాన్ని మంగళవారం తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రజల దీవెనలే తమ పార్టీకి శ్రీరామరక్ష అని, ప్రతి ఒక్కరికీ న్యాయం చేయడమే లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు.