రైతులకు ఆధునిక సౌకర్యాలను చేరువ చేయడం ప్రభుత్వ లక్ష్యము

0చూసినవారు
రైతులకు ఆధునిక సౌకర్యాలను చేరువ చేయడం ప్రభుత్వ లక్ష్యము
సిద్ధిపేట జిల్లా గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, రైతుల ఆదాయాన్ని పెంచేందుకు మార్కెటింగ్ వ్యవస్థను బలోపేతం చేయడం, ఆధునిక సౌకర్యాలను అందుబాటులోకి తేవడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గురువారం గజ్వేల్ ఏఎంసీ ఆధ్వర్యంలో 99 రోజుల ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రైతులకు తక్కువ వడ్డీకే పంట రుణాలు అందేలా బ్యాంకులతో సమన్వయం చేస్తున్నామని, దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణాలపై స్పష్టమైన మార్గదర్శకత్వం అందిస్తున్నామని ఆయన వివరించారు.

సంబంధిత పోస్ట్