మర్కుక్ లో ప్రారంభం అయిన నాభి శిల ప్రతిష్ఠ

10చూసినవారు
మర్కుక్ లో ప్రారంభం అయిన నాభి శిల ప్రతిష్ఠ
మర్కుక్ మండల కేంద్రంలో బుధవారం నాభి శిల బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గ్రామ పురోహితులు మాధవ శర్మ మాట్లాడుతూ గ్రామం సుభిక్షంగా ఉండాలని, గ్రామదేవతలకు పండుగలు గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవాలు నిర్వహించడం, సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని పూజలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బుల్లె రాణి మహేష్, ఉప సర్పంచ్ సాయిని మహేష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్