సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం గజ్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వృద్ధురాలిని ఒక గుర్తు తెలియని వ్యక్తి అతికిరాతకంగా హత్య చేసి ఆమె వద్ద ఉన్నటువంటి బంగారు చైన్, చెవి కమ్మలు దొంగిలించుకుని పోయిన వ్యక్తిని గజ్వేల్ పోలీస్ సిబ్బంది పట్టుకున్నారు. నిందితుని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్టు పోలీసులు తెలిపారు.